Homeఅంతర్జాతీయంరాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?

రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?


One Nation One Election : దేశంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు తెరపడింది. ఎట్టకేలకు ఈ రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఒకే దేశం – ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టారు. అంతకుముందు ఈ రెండు బిల్లులకు డిసెంబర్ 12న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఈ బిల్లును ఈరోజు అంటే డిసెంబర్ 17న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు అమలయ్యాక ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం పడిపోతే ఆ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చాలా మందిలో మెదులుతోన్న ప్రశ్న.

వన్ నేషన్ వన్ ఎలక్షన్

వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభలో నేడు ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఈ బిల్లుకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయిన తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందనేది ఆ ప్రశ్నలలో ఒకటి. ఈ బిల్లు అమలు తర్వాత ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం పడిపోతే, ఏం చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభుత్వం పడిపోతే ఏమవుతుంది?

వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులో అనేక రకాల నిబంధనలు రూపొందించారు. అవిశ్వాస తీర్మానం వల్లనో, లేదా మరేదైనా కారణంతోనో ప్రభుత్వం పడిపోతే.. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారనే నిబంధన కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ నిబంధన ప్రకారం, ఆ సమయంలో ఆ రాష్ట్రంలో మళ్లీ మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కొత్త అసెంబ్లీ పదవీకాలం వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు మాత్రమే ఉంటుంది. అంతే కాకుండా ఎన్నికల నిర్వహణకు ముందు అవసరమైన అన్ని అవసరాలను పూర్తి చేయాలని కూడా ఎన్నికల కమిషన్‌ను బిల్లులో ఆదేశించింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల కోసం ఎన్నికల సంఘం కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని బిల్లులో వివరంగా తెలిపింది.

బిల్లు ఏం చెబుతోంది?

బిల్లులో తెలిపిన నిబంధన ప్రకారం, లోక్‌సభ లేదా అసెంబ్లీని మధ్యలోనే రద్దు చేయాల్సి వస్తే, మిగిలిన ఐదేళ్ల కాలానికి మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. బిల్లులో ఆర్టికల్ 82 (ఎ), 172, 327లను చేర్చాలనే ప్రతిపాదన కూడా ఉంది. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన 82 (ఎ)లో ఉంది. ఇది కాకుండా, 83లో పార్లమెంటు సభల పదవీకాలానికి సంబంధించిన నిబంధన కూడా ఉంది. అంతే కాకుండా సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రపతి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని కూడా చట్టంలో పేర్కొన్నారు. అందిన సమాచారం ప్రకారం, 2029 లోక్‌సభ ఎన్నికలు మునుపటిలా నిర్వహించనున్నారు. ఆ తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు అమలులోకి వస్తుంది.

తొలిసారిగా ఎలక్ర్టానిక్ పద్ధతిలో ఓటింగ్ 

వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై లోక్ సభలో ఓటింగ్ నిర్వహించారు. తొలిసారిగా ఎలక్ర్టానిక్ పద్ధతిలో ఓటింగ్ చేపట్టగా.. సాంకేతిక సమస్యలున్న చోట, కొందరు సభ్యులకు స్లిప్పుల ద్వారా ఓటింగ్ అమలు చేశారు. ఈ బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లుపై చర్చలో జేపీసీకి అభ్యంతరం లేదని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments