Is Kejriwal making a strategic mistake in resigning : ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఆయన రాజీనామా చేసి తప్పు చేశారని.. మరోసారి అలా చేయబోనని ప్రజలకు వాగ్దానం చేశారు. అయినా ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తున్నారు. ఆయన నిర్ణయం గతంలోలా మిస్ ఫైర్ అవుతుందా లేకపోతే ఈ సారి జాక్ పాట్ కొడతారా?
మొదటి సారి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ రాజకీయం రాజీనామాతోనే ప్రారంభమయింది. మొదటి సారి ఎన్నికలకు వెళ్లినప్పుడు ఆయనకు పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ విపక్ష పార్టీ తరహాలోనే రాజకీయం చేశారు. కేంద్రంపై ధర్నాలు చేశారు. చివరికి విచిత్రమైన కారణాలు చెప్పి రాజీనామా చేసేశారు. ఇది ప్రజల్ని వంచించినట్లయింది. దీంతో ప్రజలు కేజ్రీవాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు మళ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తాను రాజీనామా చేసి తప్పు చేశానని మరోసారి అలాంటి తప్పు చేయబోనని ప్రజల్ని వేడుకున్నారు. ప్రజలు కూడా క్షమించారు. ఘన విజయం సాధించారు.
అక్స్‌ఫర్డ్ నుంచి ఢిల్లీ సీఎం పీఠం వరకూ – అతిషీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?
ఇప్పుడు మరోసారి రాజీనామా బాట
ఆ తర్వాత కేజ్రీవాల్ రెండు సార్లు సీఎం అయ్యారు. రెండు సార్లు ప్రజలు ఆయనకు తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. ఇతర పార్టీలకు కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనపై వచ్చిన ఆరోపణలు.. అరెస్టు .. తర్వాత బెయిల్.. కోర్టు ఆంక్షల కారణంగా రాజీనామా చేయాలనుకున్నారు. అయితే అది పైకి కనిపించే కారణం మాత్రమే. మరోసారి రాజకీయంగా వెలిగేందుకు ఢిల్లీలో గెలిచేందుకు ఆయన రాజీనామా వ్యూహం పన్నారు.
ప్రజల నుంచి క్లీన్ చిట్ వచ్చిందని చెప్పుకునే వ్యూహం
డిల్లీ లిక్కర్ స్కాం ఇప్పుడల్లా తేలదని అందుకే పదవికి రాజీనామా ప్రజల వద్దకు వెళ్తున్నానని కేజ్రీవాల్ అంటున్నారు. ప్రజాకోర్టులో తాను గెలిస్తే అటే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే తనకు క్లీన్ చిట్ వచ్చినట్లుగా తీర్మానించుకుని మళ్లీ సీఎం పదవి చేపడతారు. ఇక్కడే ఆయన అసలైన రాజకీయ వ్యూహం ఉందని అనుకోవచ్చు. అయితే ఈ వ్యూహం ఎంత వరకు వర్కవుట్ అవుుందనేది కూడా సందేహమే.ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పటి నుండి ఢిల్లీ .. ఆ పార్టీ చేతుల్లోనే ఉంది. సరైన అధికారాలు లేని ప్రభుత్వమే అయినా తమ పరిధిలో ఉన్న విషయాల్లో కీలకమైన ప్రగతిని చూపించడంతో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం గడుతున్నారు. కానీ పార్లమెంట్ కు వచ్చే సరికి మొత్తం.. బీజేపీకే సీట్లు ఇస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ డిల్లీలో ఒక్క సీటు కూడా కూటమికి రాలేదు.
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిషీ – కేజ్రీవాల్ ప్రతిపాదనకు ఆప్ శాసనసభాపక్షం ఆమోదం
ఫలితం తేడా వస్తే కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్ అంధకారమే
ఢిల్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయి. ముందుగా జరిగే అవకాశం లేదు. కేజ్రీవాల్ డిమాండ్ చేసినా జరపరు. పూర్తిగా ప్రభుత్వాన్ని రద్దు చేస్తే మహారాష్ట్రతో పాటు నిర్వహించే అవకాశం ఉండేది. ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల్లో తేడా వస్తే కేజ్రీవాల్ ను అవినీతిపరుడుగా ప్రజలు గుర్తించారని విపక్షాలు తేల్చేస్తాయి. కేజ్రీవాల్ కూడా కాదనలేరు. ఎందుకంటే ఆనయ ఎన్నికలకు వెళ్తున్న నినాదం అదే మరి. ఒక వేళ గెలిస్తే.. కేజ్రీవాల్ .. తనను ప్రజలు నిర్దోషిగా తీర్పు ఇచ్చారని ప్రకటించుకుంటారు. లేకపోతే ఆయన రాజకీయ భవిష్యత్ పై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అందుకే రాజీనామా నిర్ణయం అనేది కేజ్రీవాల్ ఎంతో రిస్క్ తో చేసిన రాజకీయ నిర్ణయం అనుకోవచ్చు.
మరిన్ని చూడండి