Player Struck by Lightning During Live Match Dies on Field: మొత్తం ఆట మీదనే దృష్టి ఉంది. బాల్ వైపే అందరి చూపు ఉంది. కానీ వారు పైన ఉరుముతున్న మెరపులు తమ పాలిట మృత్యుశాపాలు అవుతాయని అనుకోలేదు. చివరికి ఆ మెరుపుల నుంచి ఊడిపడిన ఓ పిడుగు.. ఆ మ్యాచ్ ను కకావికలం చేసింది. తీవ్ర విషాదాన్ని నింపిది. ఆ పిడుగు దెబ్బకు ఒక ప్లేయర్ చనిపోయారు. పలువురు విషమ పరిస్థితుల్లోకి వెళ్లారు. ఈ ఘటన పెరూలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
CRAZY: Lightning killed a football player during a match in Peru and injured five others, they are in hospital with serious burns
What a crazy and a random thing. Insane. pic.twitter.com/aRZsRCaEJo
— First Source Report (@FirstSourceNew) November 4, 2024
పెరూలో ఫుట్ బాల్ అంటే ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ప్రతి ఊళ్లోనూ ఫుట్ బాల్ గ్రౌండ్స్ ఉంటాయి. లోకల్ గా ఎన్నో టీములు ఉంటాయి. ఫుట్ బాల్ క్లబ్స్ మధ్య కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి రెండు ఫుట్ బాల్ క్లబ్స్ మధ్య ఇటీవల ఓ మ్యాచ్ జరిగింది. వర్షం వచ్చేలా ఉన్నప్పటికీ రెండు జట్ల మధ్య పోటీని ఫైనల్ చేశారు. ఎంతో మంది జనం కూడా రావడంతో మ్యాచ్ ప్రారంభమయింది. పోరు హోరాహోరీగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా పిడుగుపడింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు ఆటగాళ్లు అందరూ కింద పడిపోయారు.
యూఎస్ ఎన్నికల్లో టై అయితే ఏమవుతుంది? అమెరికా అధ్యక్షుడి జీతమెంత?
కాసేపటికి కొంత మంది తేరుకుని పైకి లేచారు. కానీ కొంత మంది లేవలేకపోయారు. ఒకరు అసలు లేవలేదు. దీంతో అర్జంట్‌గా మెడికల్ టీమ్స్ ను రప్పించారు. ఒకరు చనిపోయినట్లుగా గుర్తించారు. మిగిలిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో చాలా మందిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అక్కడి ప్రజల్ని.. ఫుట్ బాల్ ప్రేమికుల్ని కలచి వేసింది. మ్యాచ్ ను నిలిపివేశారు. పిడుగుధాటికి గాయపడిన వారు కోలుకోవాలని అక్కడి ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.
Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లలలో బెంగాలీ భాష – ఎందుకో తెలుసా ?
వతావరణం మబ్బు పట్టి ఉన్నప్పటికీ వర్షం పడటం లేదన్న కారణంగా మ్యాచ్‌ను నిర్వహించారు. పిడుగులు పడతాయని అసలు ఊహించలేపోయారు. నేరుగా ఆటగాడిపైనే పిడుగుపడటంతో కాపాడటానికి కూడా అవకాశం లేకండా పోయింది. గతంలో భారత్ లోనూ ఓ సారి హాకీ మ్యాచ్ జరుగతున్న సమయంలో పిడుగుపడి ఆటగాళ్లు గాయాలపాలయ్యారు.
మరిన్ని చూడండి