Homeఅంతర్జాతీయంముంబైలోని ఆర్బీఐ ఆఫీస్‌కి బాంబు బెదిరింపు- జర్మనీ భాషలో ఈమెయిల్ చేసిన ఆగంతకులు

ముంబైలోని ఆర్బీఐ ఆఫీస్‌కి బాంబు బెదిరింపు- జర్మనీ భాషలో ఈమెయిల్ చేసిన ఆగంతకులు


Bomb threats to RBI Office : దేశంలో త‌ర‌చుగా బాంబు బెదిరింపులు వ‌స్తూనే ఉన్నాయి. రైళ్ల‌లో బాంబులు పెట్టామ‌ని.. షాపింగ్ మాల్స్‌లో బాంబులు పెట్టార‌ని.. ఇలా ఏదో ఒకటి రోజూ వెలుగు చూస్తూనే ఉంది. ఇక‌, విమానాల్లో బాంబులు పెట్టార‌న్న స‌మాచారాలు గ‌త రెండు వారాల్లో క‌ల‌క‌లం రేపాయి. తీరా చూస్తే.. అవ‌న్నీ న‌కిలీవేన‌ని తేలింది. ఇక‌, ఇప్పుడు తాజాగా ప్ర‌ఖ్యాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కు సైతం బాంబు బెదిరింపు రావ‌డం అంద‌రినీ టెన్ష‌న్‌కు గురి చేసింది. గురువారం మ‌ధ్యాహ్నం RBI అధికారిక వెబ్‌సైట్‌లోనే ఈ బెదిరింపు మెయిల్ రావ‌డంతో అంద‌రూ టెన్ష‌న్‌కు గుర‌య్యారు.  

గురువారం మధ్యాహ్నం బాంబు బెదిరింపు ఈ-మెయిల్ కనిపించింది. ఈ ఇమెయిల్ రష్యన్ భాషలో ఉంది. రిజర్వ్ బ్యాంక్‌ను పేల్చివేయనున్న‌ట్టు ఆగంతులు దానిలో పేర్కొన్నారు. దీంతో హుటాహుటిన స్పందించిన అధికారులు మాతా రమాబాయి మార్గ్ (MRA మార్గ్) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. పోలీసులు సైతం రంగంలోకి దిగి.. బ్యాంకును ప‌రిశీలించారు. కాగా.. గత నెలలో కూడా RBI కస్టమర్ కేర్ నంబర్‌కు ఇలానే ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అప్ప‌ట్లో ఫోన్ చేసిన వ్య‌క్తి తనను తాను ఉగ్ర‌వాద సంస్థ‌ లష్కరే తోయిబా సీఈవోగా చెప్పుకొన్నాడు. బ్యాంక్‌ను బాంబుతో పేల్చివేస్తానని బెదిరించాడు. కానీ, అప్ప‌ట్లో ఎలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేదు. 

ఢిల్లీ స్కూళ్ల‌కు కూడా..  

ఢిల్లీలోని ప‌లు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు మొద‌ల‌య్యాయి. రెండు నెల‌ల కింద‌ట ఇలానే బెదిరింపులు రావ‌డంతో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యాయి. వాటి నుంచి తేరుకోక‌మేందు. తాజాగా మ‌రోసారి శుక్ర‌వారం(13, డిసెంబ‌రు) ఉద‌యం కూడా బెదిరింపు మెయిళ్లు వ‌చ్చాయి. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ద‌ర్యాప్తు చేశారు. అయితే.. ఈ దర్యాప్తులో అనుమానాస్పద వ‌స్తువులు కానీ, బాంబులు కానీ గుర్తించలేదు. 

4 స్కూళ్లకు బెదిరింపులు..

ఢిల్లీలో పేరొందిన ఈస్ట్ ఆఫ్ కైలాష్ DPS, సల్వాన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్, మోడ్రన్ స్కూళ్ల‌కు తాజాగా బాంబు బెదిరింపు ఈ మెయిళ్లు వచ్చాయి. ఈ రోజు(శుక్ర‌వారం) ఉద‌యం య‌థావిధిగా ఆయా పాఠ‌శాల‌లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ఇంత‌లోనే పాఠ‌శాల‌ల‌కు బెదిరింపు ఈమెయిళ్లు వ‌చ్చాయి. దీంతో యాజ‌మాన్యాలు హుటాహుటిన ఈ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖకు చేర‌వేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేప‌ట్టారు. ఆయా స్కూళ్ల‌లో అణువ‌ణువూ గాలించారు. అయితే.. ఎక్క‌డా అనుమానాస్ప‌ద వ‌స్తువులు ల‌భించ‌లేద‌ని పోలీసులు తెలిపారు.  

కామ‌న్ అయిపోయాయా? 

ఇటీవ‌ల కాలంలో ఢిల్లీలో ప్రతిరోజూ ఎవరో ఒక‌ గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ లేదా కాల్ ద్వారా బాంబుల‌తో దాడి చేస్తాం అంటూ.. యాజమాన్యాన్ని బెదిరించ‌డం కామ‌న్ అయిపోయింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి త‌ల్లిదండ్రులు కూడా భయాందోళనతోనే పాఠ‌శాల‌కు పిల్ల‌లను పంపుతున్నారు. గత సోమవారం (డిసెంబర్ 9) కూడా ఢిల్లీలోని దాదాపు 40 పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్సు, ఈమెయిళ్లు వ‌చ్చాయి. సోమవారం ఉదయం అప్పటికే పిల్లలు క్లాస్‌కి హాజరయ్యేందుకు వచ్చారు. ఇంత‌లోనే ఈమెయిళ్లు రావ‌డంతో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. పాఠశాల నిర్వాహకులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పిల్లలందరినీ తిరిగి ఇంటికి పంపించారు. అప్ప‌ట్లోనే విచార‌ణ చేసిన పోలీసులు.. ప్రతి పాఠశాలలోనిఅన్ని మూలలను క్షుణ్నంగా తనిఖీ చేసారు. కానీ, ఏమీ ల‌భించ‌లేదు.

డబ్బుల కోసం!
 
డిసెంబర్ 9 సోమవారం బెదిరింపు ఈ-మెయిల్ పంపిన వ్యక్తి ఏకంగా 3 వేల అమెరికన్ డాలర్లు డిమాండ్ చేశాడు. బాంబులు చాలా చిన్నవని, విచారణలో అవి దొరకవని కూడా చెప్ప‌డం గ‌మ‌నార్హం. సొమ్ము ఇవ్వ‌క‌పోతే  బాంబు పేలుస్తానని హెచ్చ‌రించాడు. దీంతో మ‌రింత టెన్ష‌న్ ఏర్ప‌డింది. చివ‌ర‌కు ఏమీ ల‌భించ‌క‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. 

రెండు సార్లు పేలుళ్లు 

అయితే.. ఇలా వచ్చే కాల్స్‌, ఈమెయిళ్ల‌ను లైట్ తీసుకున్నా క‌ష్ట‌మే. ఎందుకంటే.. గ‌తంలో ఢిల్లీలోని రెండు ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో రెండు పేలుళ్లు జరిగాయి. అయితే.. తీవ్ర‌త త‌క్కువ కావ‌డంతో ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించ‌లేదు.  నవంబర్ చివరలో ప్రశాంత్ విహార్‌లో సంభ‌వించిన రెండు పేలుడు ఘ‌ట‌న‌ల్లోనూ  `తెల్లటి పొడి` కనిపించింది. అయితే, అది ప్ర‌మాద‌క‌రం కాద‌ని పోలీసులు తెలిపారు. కాగా.. ప్రజల్లో భయాందోళనలు, గందరగోళం సృష్టించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని వారు భావిస్తున్నారు. అయితే ఈ పేలుళ్లు, బెదిరింపుల వెనుక ఉన్న ఉద్దేశం తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments