Sania Mirza Mohammed Shami Marriage: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్రికెటర్ మహమ్మద్ షమీని పెళ్లి చేసుకోనున్నారా..? కొద్ది రోజులుగా ఈ వార్త చక్కర్లు కొడుతోంది. వీళ్లిద్దరూ త్వరలోనే ఒక్కటవుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతకు ముందు పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని పెళ్లి చేసుకున్నారు సానియా మీర్జా. ఇటీవలే వీళ్లిద్దరూ విడిపోయారు. షోయబ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి సానియా కూడా మళ్లీ పెళ్లి చేసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. షోయబ్, సానియాకి ఓ కూతురు పుట్టింది. అటు మహమ్మద్ షమీకి కూడా విడాకులయ్యాయి. అప్పటి నుంచి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటూ ఓ పుకారు పుట్టింది. దీనిపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ తీవ్రంగా స్పందించారు. “అందులో ఏ నిజమూ లేదు. వట్టి పుకారు మాత్రమే. ఇప్పటి వరకూ షమీని సానియా ఒక్కసారి కూడా కలవలేదు” అని తేల్చి చెప్పారు.
ODI World Cup 2023తో షమీ పేరు మారు మోగిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో ఈ పుకార్లు వస్తున్నాయి. ఇటీవలే సానియా మీర్జా హజ్ యాత్రకు బయల్దేరారు. టెన్నిస్‌కి గుడ్‌బై చెప్పిన సానియా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. విడాకుల తరవాత ఆ స్ట్రెస్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. తనను తాను కొత్తగా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఇటీవల సోషల్ మీడియాలో ఆమె ఓ ఆసక్తికర పోస్ట్ కూడా పెట్టారు. ఆ అల్లా తనకు దారి చూపించి సరైన మార్గంలో నడిపిస్తాడని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇటీవలే కపిల్ శర్మ షోలో కనిపించారు సానియా మీర్జా. ఈ షోలో తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
“హజ్ యాత్రకు వెళ్లడం నా అదృష్టం. నేను క్షేమంగా వెళ్లి తిరిగి రావాలని అందరూ ఆ దేవుడిని ప్రార్థించండి. అల్లా ఆశీర్వాదంతో ఓ పరిపూర్ణమైన వ్యక్తిగా తిరిగొస్తానని నమ్ముతున్నాను”
– సానియా మీర్జా
మరిన్ని చూడండి