VinFast Makes India Debut with VF7, VF6 : అంతర్జాతీయ సంస్థ విన్‌ఫాస్ట్ ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇండియా ఆటో మొబైల్‌ని టార్గెట్ చేస్తూ.. VF7, VF6లను భారత మొబిలిటీ ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. VF7 విన్‌ఫాస్ట్ మేకర్స్ నుంచి వచ్చి ప్రీమియంగా అందరి దృష్టిని ఆకర్షించింది. జర్మన్ ఈవీలకు ప్రత్యర్థిగా దీనిని లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. విన్‌ఫాస్ట్ నుంచి ఇండియాలో తయారు చేసి లాంచ్ అయిన మొదటి కారు ఇదే. ఈ ఐదు సీట్లు కలిగి ఉన్న ఎలక్ట్రిక్ SUV ఇదే ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానున్నట్లు తెలిపారు మేకర్స్.
తమిళనాడులోని తూత్తుకుడిలో తయారీదారులు స్థానికంగా VF7ను అసెంబుల్ చేయనున్నారు. ఇతర ఫీచర్ల మాదిరిగానే.. VF7 ముందు భాగంలో కూడా Vలోగోను రూపొందించారు. సీల్డ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డిజైన్‌తో హెడ్ ల్యాంప్ యూనిట్స్, ఎయిర్ వెంట్ గ్రిల్‌తో క్లీన్ డిజైన్ చేశారు. స్ట్రాంగ్ షోల్డర్ లైన్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లతో మినిమలిస్టిక్ డిజైన్స్ VF7 సొంతం.
VF7 ఫీచర్లు ఇవే..
కారులోపల 15 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్నిచ్చారు. HUD, పనోరమిక్ సన్‌రూఫ్, 8 ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లెవెల్ 2 ADASలను కలిగి ఉంది. ఈ SUVని 75.4 kWh భారీ లిథియం అయాన్ బ్యాటరీని డ్యూయల్ మోటారు కాన్ఫిరిగేషన్తో అందుబాటులోకి తెచ్చారు. ఫుల్ ఛార్జ్‌తో 450 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 349 hp, 500 Nm టార్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది.
VF6 ఫీచర్లు ఇవే..
విన్‌ఫాస్ట్ SUVలలో రెండో వేరియంట్ అయిన VF6 కూడా అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఈ వేరియంట్ 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్తో వచ్చింది. 171 bhp, 250 Nm టార్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తూ.. ఫుల్ వెర్షన్ ఛార్జ్‌తో 400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ప్లస్ వెర్షన్లో 198 bhp, 309 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తూ.. ఫుల్ ఛార్జ్‌తో 381 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
ప్లస్ పాయింట్ అదే
VF7, VF6 ప్రీ బుకింగ్ మాత్రం ప్రీ ఫెస్టివ్ పీరియడ్‌లో ప్రారంభమవుతుందని తెలిపారు మేకర్స్. VF7 డెబ్యూ అయితే ఇచ్చారు కానీ ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాటరీ పరిమాణం, దాని లగ్జరీ ఫీచర్స్‌ని బట్టి.. ఇది ఇతర లగ్జరీ కార్ల తయారీదారులకు గట్టి పోటి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా 10 సంవత్సరాల వారంటీని అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది విన్‌ఫాస్ట్. గ్లోబల్ మోడల్ ఫీచర్ అయిన దీనిని ఇండియాలో కూడా అందిస్తుంది.
వియత్నామీస్ (Vietnamese) ఇప్పటికే మూడు ఖండాల్లోని 12 దేశాల్లో EV మేకర్‌గా తన మార్క్ వేసింది. వియత్నాం కాకుండా.. ఇండోనేషియా, యూనైటెడ్ స్టేట్స్తో పాటు ఇండియాలో మూడో విన్‌ఫాస్ట్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మార్కెట్‌గా ఇండియాను దృష్టిలో పెట్టుకుని.. ఇప్పటికే ఉన్న లగ్జరీ కార్ల తయారీదారుల కంటే భిన్నంగా ఉండేలా వీటిని డిజైన్ చేస్తున్నట్లు విన్‌ఫాస్ట్ ఇండియా డిప్యూటీ CEO అశ్విన్ పాటిల్ తెలిపారు. బ్రాండ్ బ్యాటరీ లీజింగ్, సబ్స్క్రిప్షన్ ప్లాన్‌తో సహా పలు రకాల విక్రయ నమూనాలు పరిశీలిస్తూ మోడల్స్‌ని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
Also Read : 2025లో మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న టాటా – పంచ్, టియాగో, టిగోర్‌ల్లో
మరిన్ని చూడండి