G20 Summit 2023:
G20 సదస్సు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకోకి గ్యావెల్ అప్పగించారు. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో G20 సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు ప్రధాని మోదీ. ఇందుకు సంకేతంగా గ్యావెల్ (Gavel) అప్పగించారు. తనకు ఎంతో సన్నిహితుడైన లూయిజ్‌కి గ్యావెల్ అందిస్తున్నట్టు ప్రకటించారు.
#WATCH | G 20 in India | Prime Minister Narendra Modi hands over the gavel of G 20 presidency to the President of Brazil Luiz Inácio Lula da Silva. pic.twitter.com/ihEmXN9lty
— ANI (@ANI) September 10, 2023
దీనిపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకియో స్పందించారు. గాంధీజీకి నివాళులర్పించడం ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని వెల్లడించారు. అహింసా మార్గంలో దశాబ్దాల పాటు ముందుకు నడిచారని, అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు కురిపించారు.
#WATCH | G 20 in India | President of Brazil Luiz Inácio Lula da Silva says, “Personally, I was very much touched and emotional when I went to pay homage to our dear Gandhi today. Everybody knows that in my political life, Mahatma Gandhi has great meaning because the struggle… pic.twitter.com/odS9vR9O2D
— ANI (@ANI) September 10, 2023