Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లోని భారతీయులకు సోనుసూద్ అభయం - ఇండియాకు రప్పించేందుకు ఏం చేయబోతున్నారంటే ?

బంగ్లాదేశ్‌లోని భారతీయులకు సోనుసూద్ అభయం – ఇండియాకు రప్పించేందుకు ఏం చేయబోతున్నారంటే ?


Indians In Bangladesh : బంగ్లాదేశ్‌లో ఏర్పడిన సంక్షోభం ఆ దేశంలో ఉన్న భారతీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. స్వదేశానికి వెళ్లిపోదామని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఎలా వెళ్లాలన్నదానిపై వారికి సరైన దారి కనిపించడం లేదు. దేశమంతా అల్లర్లు జరుగుతున్న సమయంలో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఇలాంటి వారిలో కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి భారత్ లోనూ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ మహిళ ఏడుస్తూ బంగ్లాదేశ్ నుంచి  స్వదేశానికి వస్తానని చెబుతున్న వీడియో వైరల్ అయింది.     

 

ఈ వీడియోను  చూసిన నటుడు సోనూసూద్ వెంటనే స్పందించారు. ‘‘ బంగ్లాదేశ్ నుంచి మన తోటి భారతీయులందరినీ ఇండియాకు రప్పించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ వారికి మంచి లైఫ్ దొరుకుతుంది. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదు.. మనందరి బాధ్యత ” అని సోనూసూద్ చెప్పారు.              

 

సోనూసూద్ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్ లో మొత్తం పన్నెండు నుంచి పదమూడు వేల మంది  భారతీయులు ఉంటారని అంచనా. దాదాపుగా ఎనిమిది వేల మంది విద్యార్థులు స్వదేశానికి వచ్చేశారని.. విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. అయితే మిగతా వారిని తీసుకురావాలా లేకపోతే పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉందా అన్నదానిపై పరిశీలన జరుపుతున్నారు. బంగ్లాదేశ్ నుంచి భారతీయుల్ని తరలించాల్సినంత ఘోరమైన పరిస్థితులు లేవని.. వారంతా సురక్షితంగానే ఉన్నారని భారత విదేశాంగ శాఖ చెబుతోంది. అయితే ఉద్యమం ఎటు వైపు మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం కాబట్టి.. తరలించాల్సి వస్తే.. వెంటనే ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.                          

మరో వైపు బంగ్లాదేశ్ లో హిం దువులపై దాడులంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ అక్కడ హిందువులపై దాడులేమీ లేవని చెబుతున్నారు. లిట్టన్ దాస్ అనే హిందూ క్రికెటర్ ఇంటిపై దాడి చేశారని.. ఇంటికి నిప్పు పెట్టారని ప్రచారం చేస్తున్నారు. కానీ అది పాత వీడియో ఆ ఇల్లు కూడా లిట్టన్ దాస్ ది కాదని ఫ్యాక్ట్ చెక్ చేసిన వాళ్లు చెబుతున్నారు. 

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments