What do married women search the most on Google: మన ఇంట్లో రిమోట్ లో బ్యాటరీలు అయిపోయినా ఎలా రీప్లేస్ చేసుకోవాలో గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. అలా ఇన్ని వర్గాల ప్రజలు .. తమకు ఏ ఏ విషయాల్లో డౌట్స్ ఉన్నాయో.. ఏఏ విషయాలపై క్లారిటీ తీసుకోవాలో గూగుల్‌నే అడుగుతూ ఉంటారు. విద్యార్థులు ఎక్కువగా తమ పాఠాల్లో వచ్చే డౌట్స్, పురుషులు ఖాళీగా ఉంటే పనికి మాలిన విషయాలు సెర్చ్ చేస్తూంటారు. మరి పెళ్లయిన మహిళలు ఏం సెర్చే చేస్తారు? ఈ డౌట్ చాలా మంది మగవాళ్లకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా బయయటకు వచ్చిన ఓ అధ్యయానంలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిజానికి ఇలాంటి విషయాల్లో మహిళలు చాలా వరకూ నిజం చెప్పరు. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ల మాటకు అర్థాలే వేరులే అనుకోవాలి. ఇలా అన్ని రకాల పాజిబులిటీస్ ను లెక్కకలేసిన తర్వాత ఓ అధ్యయనం కొన్ని ఫలితాలను విశ్లేషించింది. మహిళలు .. ముఖ్యంగా పెళ్లయిన మహిళలు అత్యధికంగా సెర్చ్ చేసేది తమ భర్త ప్రేమను ఎలా పొందాలి.. ఆయన హృదయాన్ని ఎలా గెల్చుకోవాలనే. ఈ సెర్చ్ రిజల్ట్ ను చాలా మంది అంగీకరిస్తారు. ఎందుకంటే భారతీయ సమాజంలో భర్తను ఎలా సంతోషపెట్టాలో ఆలోచించే భార్యలు ఎక్కువగా ఉంటారు.
అలాగే అంతంగా కనిపించేదుకు ఏం చేయాలి.. బ్యూటీ టిప్స్ తీసుకోవడం.. వంటల్లో వచ్చే డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసం ఎక్కువగా క్లియర్ చేస్తారు. అదే సమయంలో అత్తగారికి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో వారందరితోనూ ఎలా సర్దుకుపోవాలో కూడా ఎక్కువ మంది గుగూల్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. తన భర్తతో పాటు ఇంట్లో అందర్నీ మెప్పించేలా ఎలా ఉండాలన్నదానిని గుగూల్ లో తెలుసుకుని నడుచుకుంటున్నారు. నిజానికి మగవాళ్లను ముఖ్యంగా భర్తలను అర్థం చేసుకుని వారికి తగ్గట్లుగా తనను తాను మార్చుకోవడం అనేది ప్రతి భర్తకు ఓ సవాల్ లాంటిది. భార్యభర్తల్లో ఎవరు ఆధిపత్యం ప్రదర్శించాలని అనుకున్నా తేడాలు వచ్చేస్తాయి. అందుకే భార్యలు భర్త మనస్థత్వాన్న అర్థం చేసుకుని ఆయనను మెప్పించేందుకు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.
పెళ్లయిన మహిళలు చేసే మరో కీలకమైన సెర్చ్.. గిఫ్టులు. గిఫ్టింగ్ ఆప్షన్స్ కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తారు. పెళ్లిళ్లకు..బర్త్ డేలకు వెళ్లేటప్పుడు ఎవరికి ఎలాంటి గిఫ్టులు ఇవ్వాలి. ఎలాంటివి ఇస్తే బాగుంటాయన్నది కూడా సెర్చ్ చేస్తారని నివేదికలు చెబుతున్నాయి. మొత్తంగా పెళ్లయిన మహిళలు ఎక్కువగా కుటుంబాన్ని నిలుపుకోవడం .. వారి అభిమానాన్ని పొందడం కోసం నిరంతరం చేసే ప్రయ్తనంలో భాగంగా ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేస్తున్నారని అనుకోవచ్చు.
మరిన్ని చూడండి