Homeఅంతర్జాతీయంనీట్‌ పీజీ-2024 నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం, పరీక్షకు 2 గంటల ముందుగా ప్రశ్నపత్రం రెడీ

నీట్‌ పీజీ-2024 నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం, పరీక్షకు 2 గంటల ముందుగా ప్రశ్నపత్రం రెడీ


NEET-PG Revised Exam Date: దేశవ్యాప్తంగా నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 23న నిర్వహించాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది. అయితే పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించేది వెల్లడించలేదు. అయితే జులై నెలాఖరు లేదా ఆగస్టు మొదటివారంలో నీట్ పీజీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పరీక్షకు సంబంధించిన షెడ్యూలు వారంరోజుల్లో వెలువడే అవకాశం ఉంది. అయితే పరీక్షలో అక్రమాలకు ఆస్కారం లేకుండా చివరి గంటల్లోనే ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పరీక్షకు కేవలం 2 గంటల ముందు ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసి సెంటర్లకు పంపించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. 

నీట్-పీజీ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రక్రియల పటిష్టతను క్షుణ్ణంగా అంచనా వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. నీట్ పీజీ పరీక్ష కొత్త తేదీని జులై 2న ప్రకటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పరీక్ష నిర్వహణ కోసం ఎన్‌బీఈ సిద్ధం చేసిన షెడ్యూలుకు కేంద్రం నుంచి ఇంకా ఆమోదం లభించలేదని ఎన్‌బీఈ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నీట్ పీజీ షెడ్యూలును ప్రకటిస్తామన్నారు. జులై చివర్లో లేదా ఆగస్టులో పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయని, పరీక్ష షెడ్యూలును జులై 5లోగా వెల్లడిస్తామని ఆయన అన్నారు.

యూజీసీ నెట్ తేదీలు వెల్లడి..
పేపర్ లీక్ వార్తల నేపథ్యంలో ఇటీవల రద్దయిన యూజీసీ నెట్ జూన్ సెషన్‌ పరీక్షల కొత్త తేదీని NTA తాజాగా వెల్లడించింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్య యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. దీంతోపాటు వాయిదాపడిన సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్-2024 పరీక్షను జులై 25 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా ఎన్‌సెట్ (NCET) పరీక్షను జులై 10న నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. ఆల్ ఇండియా ఆయుష్ పీజీ ప్రవేశ పరీక్ష-2024ను జులై 6న నిర్వహించనున్నట్లు తెలిపింది. 

ALSO READ:

విశాఖపట్నం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో ఎంటెక్ ప్రోగ్రామ్
విశాఖపట్నంలోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE)’ 2024 సంవత్సరానికిగాను ఎంటెక్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కనీసం 55 శాతం మార్కులతో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. సరైన అర్హతలున్నవారు జులై 18 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా ఇండియన్ విద్యార్థులు రూ.1000. ఎంపికైనవారు ఆగస్టు 2లోగా నిర్ణీత ఫీజు చెల్లించాలి. అదేవిధంగా సీటు నిర్దారణ తర్వాత నిర్ణీత సెమిస్టర్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశాలు పొందినవారికి ఆగస్టు 12 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. జేఈఈ-అడ్వాన్స్‌డ్ 2024 స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రతిభావంతులైన మహిళా విద్యార్థులకు నెలకు రూ.3000 స్కాలర్‌షిప్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు మినహాయింపులు అందిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి..

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments