Gym Trainer Killed Woman In Kanpur: తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను జిమ్ ట్రైనర్ చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని సైలెంట్‌గా పూడ్చేశాడు. ‘దృశ్యం’ సినిమా తరహా క్రైమ్ సీన్‌ను తలపించిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో (Utttarapradesh) చోటు చేసుకుంది. నాలుగు నెలల అనంతరం పోలీసుల విచారణలో ఈ ఘోరం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌కు చెందిన ఏక్తాగుప్తా అనే మహిళ కనిపించడం లేదని ఆమె భర్త రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. జిమ్ ట్రైనరే హంతకుడని గుర్తించి శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఏక్తాగుప్తాకు విమల్ అనే జిమ్ ట్రైనర్‌తో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు విచారణలో గుర్తించారు. అయితే, విమల్ మరో మహిళను వివాహం చేసుకుంటున్నాడని తెలిసి ఏక్తాగుప్తా అతన్ని నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విమల్ ఆమె మెడపై బలంగా కొట్టడంతో మృతి చెందింది.
సైలెంట్‌గా పూడ్చేశాడు
ఏక్తాగుప్తా మృతదేహాన్ని ప్లాన్ ప్రకారం మూడో కంటికి తెలియకుండా మాయం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో శవాన్ని కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పూడ్చేశాడు. విమల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. అయితే, ఈ దారుణం 4 నెలల వరకూ ఎవరికీ తెలియలేదు. ముమ్మర విచారణ చేసిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి నిందితున్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
Also Read: Google : గూగుల్‌పై కోర్టుకెళ్లి రూ.26 వేల కోట్ల పరిహారం పొందుతున్నారు – ఈ యూకే జంట పంట పండినట్లే !
మరిన్ని చూడండి