Homeఅంతర్జాతీయంతల్లి సెంటిమెంట్, ఈ వీడియో చూస్తే కళ్లు చెమ్మగిళ్లాల్సిందే!

తల్లి సెంటిమెంట్, ఈ వీడియో చూస్తే కళ్లు చెమ్మగిళ్లాల్సిందే!


Viral News: అమ్మ.. ఈ విశ్వంలోనే అందమైన పదం. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే, ఆమె కోసం ఏం చేసినా తక్కువే. దేవుడు అన్నిచోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు. మనం పుట్టినప్పటి నుంచి పెద్ద చేసే వరకు అమ్మ పడే కష్టం అంతా ఇంతా కాదు. మనకు కష్టం కష్టం వస్తే తన కళ్లలో నీరు వస్తుంది. ఎంతటి వ్యక్తి అయినా తన తల్లి గురించి ఆలోచిస్తే కళ్లు చెమ్మగిల్లాల్సిందే.  అమ్మ గురించి రాయాలంటే అక్షరాలు సరిపోవు. ఈ భూమి మీద అమృతం ఉందో లేదో తెలియదు కానీ అమృతమనే మాటకు నిలువుటద్ధం అమ్మ. తన పిల్లల కోసం సర్వస్వం త్యాగం చేస్తూ, వారి ఉన్నతిని ఆకాంక్షిస్తుంది.

చిన్నప్పుడు తన కొడుకు కొద్దిసేపు కనపడకపోతే అల్లాడిపోతుంది అమ్మ మనసు. అలాంటిది బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్తే, సంవత్సరాల పాటు తిరిగిరాకపోతే ఆ తల్లి మనసు ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలమా? కొడుకు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదో, ఎంత కష్టపడుతున్నాడో ఇలా వంద ప్రశ్నలు ఆమె మనసును తొలచివేస్తుంటాయి. అలాంటి సమయంలో దూరంగా ఉన్న కొడుకు ఒక్కసారిగా కళ్ల ముందుకు వస్తే ఆమె ఆనందం మాటల్లో వర్ణించగలమా? 

సరిగ్గా ఇలాంటి ఘటననే కర్ణాటకలోని ఉడిపిలో జరిగింది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కొడుకు చెప్పకుండా ఇండియాకు వచ్చాడు. మొహానికి ముసుగు కట్టుకుని తన తల్లి వద్దకు చేపలు కొనే కష్టమర్‌గా వెళ్లాడు. బేరం చేశాడు. కొడుకు గురించి తల్లికి తెలియదా? రెండు నిమిషాల మాటల్లో వచ్చింది తన కొడుకేనని గుర్తించింది. అతన్ని పట్టుకుని ఆశ్చర్యం, ఆనందంతో కన్నీరు కార్చింది. తల్లీ కొడుకుల మధ్య ప్రేమను చాటే ఈ సన్నివేశం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉడిపిలోని గంగోల్లిలో నివాసముంటున్న రోహిత్ మూడేళ్ల క్రితం తర్వాత జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. నాలుగు రోజుల క్రితం ఇండియాకు వచ్చాడు. తాను వస్తున్న విషయం రోహిత్ కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్పలేదు. వారికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. ఇంటికి వెళ్లి చూస్తే తల్లి లేదు. ఆమె ఎక్కడ ఉంటుందో రోహిత్‌కు బాగా తెలుసు. వెంటనే డిపిలోని కందపుర తాలూకాలోని గంగోల్లి మార్కెట్‌‌కు వెళ్లాడు. అక్కడ రోహిత్ తల్లి సుమిత్ర చేపలు అమ్ముతూ కనిపించింది. దీంతో రోహిత్ ముఖానికి ఖర్చీఫ్ కట్టుకుని, టోపీ పెట్టుకుని తల్లి వద్దకు వెళ్లాడు. చేపలు కావాలంటూ బేరం ఆడాడు. ఆమె అతని కోసం చేపలను కూడా ప్యాక్ చేయడం ప్రారంభించింది.

మాటల క్రమంలో వచ్చిన వ్యక్తి తన కొడుకేనని ఆమెకు అనుమానం వచ్చింది. రోహిత్ ఖర్చీఫ్ తొలగించి చూసింది. కొడుకే కావడంతో ఆ తల్లి ఆనందం అంతా ఇంతా కాదు. కొడుకును కౌగిలించుకుని కళ్లలో వస్తున్న నీటిని తుడుచుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments