Homeఅంతర్జాతీయంఢిల్లీలో ఉద్రిక్తత, పాలస్తీనాకి మద్దతుగా విద్యార్థుల భారీ ర్యాలీ - ఈడ్చుకెళ్లిన పోలీసులు

ఢిల్లీలో ఉద్రిక్తత, పాలస్తీనాకి మద్దతుగా విద్యార్థుల భారీ ర్యాలీ – ఈడ్చుకెళ్లిన పోలీసులు


Israel Hamas War:

ఢిల్లీలో భారీ ర్యాలీ..

ఢిల్లీలో పాలస్తీనా పౌరులకు మద్దతుగా Students’ Federation of India (SFI) సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.  APJ Abdul Kalam roadలోని ఇజ్రాయేల్ రాయబార కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ర్యాలీ చేసిన వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కొందర్ని రోడ్డుపైనే లాక్కుంటూ తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించారు. పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనకారులు ప్లకార్డులు,జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటికి 16 రోజులు. బిహార్‌, కోల్‌కత్తాలోనూ ఇప్పటికే పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు జరిగాయి. అక్టోబర్ 13వ తేదీన పాలస్తీనా మద్దతుదారులు మార్చ్ నిర్వహించారు. ఇజ్రాయేల్ జెండాలను తగలబెట్టారు. కోల్‌కత్తాలోనూ అక్టోబర్ 12న ఇలాంటి నిరసనలే జరిగాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైంది. హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా ఇజ్రాయేల్‌పై రాకెట్‌ల వర్షం కురిపించారు. కేవలం 20 నిముషాల్లోనే 5 వేల రాకెట్‌లతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయేల్‌ హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి గాజాపై దాడులు చేస్తూనే ఉంది. బంకర్లలో నక్కి ఉన్న హమాస్ ఉగ్రవాదుల్ని మట్టుబెడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ 4,700 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 1,400 మంది ఇజ్రాయేల్‌ పౌరులు బలి అయ్యారు. వేలాది మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అటు వెస్ట్‌బ్యాంక్‌లోనూ ఇజ్రాయేల్ దాడులు మొదలయ్యాయి. ఇప్పటికే 93 మంది పాలస్తీనియన్‌లు మృతి చెందారు. 

“పాలస్తీనాలో జరుగుతున్న మారణకాండను తక్షణమే ఆపేయాలన్నదే మా ప్రధాన డిమాండ్. ఈ అన్యాయాన్ని అడ్డుకునేందుకు అందరూ ఒక్కటవ్వాలని పిలుపునిస్తున్నాం”

– SFI





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments