చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన వెలుగు చూసింది. సాధారణంగా తాము పడ్డ కష్టాలు కన్నబిడ్డలు పడకూడదని తల్లిదండ్రులు భావిస్తారు. పిల్లల భవిష్యత్ కోసం ఎంతగానో శ్రమిస్తారు. కానీ తక్కువ సమయంలో, అది కూడా తప్పుడు మార్గంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కుమార్తెను సైతం మురికి కూపంలోకి లాగారు. కూతురితో పాటు మరికొందరు బాలికల అసభ్య వీడియోలు తీసి విక్రయిస్తున్నారని ఓ జంటతో పాటు మరో ఇద్దర్నీ చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం కుమార్తె అసభ్యకర వీడియోలు తీసి విక్రయించిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..
మైలాపూర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చెన్నైకి చెందిన వ్యక్తి అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంపై ఫిర్యాదు చేశాడు. పోలీసులకు రెండు మొబైల్స్ అప్పగించిన అతడు, వాటిలో బాలికల అసభ్యకర వీడియోలు చాలా ఉన్నాయని చెప్పాడు. ఆ వీడియోలను ఇతరులకు షేర్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్యాష్ చేసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాలికతో సన్నిహితంగా ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. వీరితో పాటు బాలిక తల్లిదండ్రులను సైతం అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. నిందితులలో ఒకరు తాంబరం, మరో వ్యక్తి పట్టనప్పాక్కం ప్రాంతానికి చెందినవాడు. బాలికతో అసభ్యకర వీడియోలు చేయడానికి సహకరించింది అమ్మాయి తల్లిదండ్రులేనని ఆ ఇద్దరు నిందితులు విచారణలో అంగీకరించారు.
స్కూలుకు వెళ్తున్న తమ కుమార్తెను తల్లిదండ్రులు బెదిరించి వ్యభిచారకూపంలోకి లాగారు. తాము చెప్పినట్లు చేయాల్సిందిగా బెదిరించడంతో బాలిక వారు చెప్పినట్లు చేసింది. ప్లాన్ ప్రకారం బాలిక తల్లిదండ్రులే వీడియోలు తీసి వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. బాధిత బాలిక తండ్రి మొబైల్ తీసుకుని చెక్ చేయగా, మరికొందరు విద్యార్థినులతోనూ అసభ్యకర వీడియోలు తీసినట్లు పోలీసులు గుర్తించారు. బాధిత బాలికలను అడిగితే.. తమను బెదిరించి ఇలాంటి పనులు చేయించారని కన్నీటి పర్యంతమయ్యారు. వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా? ఈ గ్యాంగ్‌కు ఎవరైనా పెద్దలతో సంబంధాలు ఉన్నాయా అని అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
మరిన్ని చూడండి