Homeఅంతర్జాతీయంజో బైడెన్ కాన్వాయ్‌ డ్రైవర్ నిర్లక్ష్యం, తాజ్‌ హోటల్‌లోకి దూసుకెళ్లిన కార్ - టెన్షన్ పడ్డ...

జో బైడెన్ కాన్వాయ్‌ డ్రైవర్ నిర్లక్ష్యం, తాజ్‌ హోటల్‌లోకి దూసుకెళ్లిన కార్ – టెన్షన్ పడ్డ సెక్య


G20 Summit 2023: 

బైడెన్ కాన్వాయ్‌లో అలజడి…

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కాన్వాయ్‌లోని ఓ డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రైవింగ్ చేసే క్రమంలో నిర్లక్ష్యం వహించడంపై బైడెన్ సెక్యూరిటీ సీరియస్ అయింది. వెంటనే అతడిని తొలగించింది. ఆ తరవాత కాసేపు ప్రశ్నించి వదిలేసింది. ఇంతగా సీరియస్ అవ్వడానికి ఓ కారణముంది. బైడెన్ కాన్వాయ్‌లోని ఓ కార్‌ అనుకోకుండా తాజ్‌ హోటల్‌లోకి వచ్చింది. యూఏఈ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అక్కడే బస చేస్తున్నారు. అక్కడికి మరే కార్‌నీ అనుమతించరు. కానీ…బైడెన్ కాన్వాయ్‌లోని ఓ డ్రైవర్‌ ఉన్నట్టుండి తాజ్‌ హోటల్‌లోకి వెళ్లిపోయాడు. ఇది గమనించిన సెక్యూరిటీ వెంటనే అప్రమత్తమైంది. కార్‌ని ఆపి డ్రైవర్‌ని నిలదీసింది. ITC మౌర్య హోటల్ అనుకుని తెలియక లోపలకు వచ్చేశానని వివరణ ఇచ్చాడు ఆ డ్రైవర్. కరెక్ట్‌ టైమ్‌కి అక్కడ ఉండాలని, అందుకే వచ్చాని చెప్పాడు. జో బైడెన్ ITC మౌర్యలో బస చేశారు. అదే హోటల్ అనుకుని తాజ్ హోటల్‌లోకి ఎంటర్ అయ్యాడు ఆ డ్రైవర్. అక్కడే ఓ బిజినెస్‌మేన్‌ని డ్రాప్ చేశాడు. ప్రోటోకాల్‌ సరిగ్గా తెలియకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. కాసేపు అతడిని ప్రశ్నించి ఆ తరవాత వదిలేశారు. 



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments