Jammu Kashmir Assembly Ruckus Video: ఆర్టికల్ 370పై మరోసారి జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఘర్షణపూరిత వాతావరణ నెలకొంది. లంగేట్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370 తొలగింపునకు సంబంధించిన బ్యానర్ సభలో చూపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులు దాన్ని లాక్కునేందుకు యత్నించారు. పరుగెత్తుకుంటూ వెళ్లి చించివేసేందుకు యత్నించారు.
గురువారం (7 నవంబర్ 2024) జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో చాలా గందరగోళం జరిగింది. ఆర్టికల్ 370పై గొడవ జరిగింది. సభ్యులు పోస్టర్లు చింపేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో సభ 20 నిమిషాల పాటు వాయిదా పడింది. 10:20 గంటలకు మరోసారి సభ ప్రారంభమైనప్పటికీ బిజెపి ఎమ్మెల్యేలు సభలో నినాదాలు చేశారు. సభను నడిపించే పరిస్థితి లేకపోవడంతో రోజంతా వాయిదా వేయాలని నిర్ణయించారు.
Also Read: విశాఖ వాసి టాలెంట్- చిరుధాన్యాలతో డొనాల్డ్ ట్రంప్ చిత్రపటం
లంగేట్ ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పోస్టర్‌తో సభకు చేరుకున్నారు. ఈ పోస్టర్‌ను చూసిన బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్టర్‌ను ఆయన చేతిలోంచి లాక్కున్నారు. ఈ టైంలో తోపులాట జరిగింది. షేక్ ఖుర్షీద్ చేతి నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు పోస్టర్‌ను తీసుకుని చించేశారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఆందోళనకు దిగారు.
This is a reminder to BJP, this is not UP, this is Jammu and Kashmir assembly.
ANY misadventure will get befitting reply!
Kudos to @sajadlone for being the fierce tiger he is and putting these BJP MLA’s in their place.
DONT REKINDLE OUR MUSCLE MEMORY!!!!! @JKPCOfficial pic.twitter.com/kJpxTK9n59
— Munneeb Quurraishi (@Muneeb_Quraishi) November 7, 2024
నేషనల్ కాన్ఫరెన్స్‌పై బీజేపీ ఆగ్రహం
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 ముగిసిన చరిత్రగా నిలిచిందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రవీంద్ర రైనా అన్నారు. 370 జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదం, పాకిస్తాన్ భావజాలాన్ని వ్యాప్తిచెందింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగ విరుద్ధంగా అసెంబ్లీలో 370 ప్రతిపాదనను తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. చాటుగా తీసుకొచ్చి హడావుడిగా సభలో ప్రదర్శించడం జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని మళ్లీ దిగజార్చాలని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ భావిస్తున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌లు భారత్‌పై కత్తికట్టాయన్నారు.
#WATCH | A ruckus breaks out at J&K Assembly in Srinagar after Engineer Rashid’s brother & MLA Khurshid Ahmad Sheikh displayed a banner on Article 370. LoP Sunil Sharma objected to this. House adjourned briefly. pic.twitter.com/iKw8dQnRX1
— ANI (@ANI) November 7, 2024
పోస్టర్ చూసి బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం
ఆర్టికల్ 370 తొలగించే బిల్లును ఆమోదించిన తర్వాత సభలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో లంగేట్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370 తొలగింపునకు సంబంధించిన బ్యానర్‌ను సభలో ప్రదర్శించారు. దీంతో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సునీల్ శర్మ ఈ బ్యానర్ ప్రదర్శనను వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య గందరగోళం పెరిగింది. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు మార్షల్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అనంతరం సభా కార్యక్రమాలు కాసేపు వాయిదా పడ్డాయి.
#WATCH | Srinagar | On ruckus in J&K Assembly, J&K People’s Conference President and Handwara MLA, Sajad Gani Lone says, “…If they don’t bring a resolution, then it is a fixed match. They (National Conference) brought a weak resolution. We did not come to the Assembly for this.… pic.twitter.com/MZU1mSbonl
— ANI (@ANI) November 7, 2024
Also Read: ట్రంప్ గెలుపుతో భారత్‌కు లాభమా ? నష్టమా ?
మరిన్ని చూడండి