Jammu & Kashmir News: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో గురువారం (డిసెంబర్ 19) ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.
బుధవారం (డిసెంబర్ 18) రాత్రి బెహిబాగ్ ప్రాంతంలోని కద్దర్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో సైన్యం కార్డన్ ఆన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఆ టైంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన సైన్యం ప్రతిగా కాల్పులు జరిపింది.
Also Read: దేశంలో 6జీ వస్తే 5జీ ఫోన్లు పనిచేయవా.. కొత్త నెట్ వర్క్ తో నష్టమా, లాభమా?
ఈ విషయంపై సైనికాధికారులు పిటిఐతో మాట్లాడుతూ… అనుమానిత ఉగ్రవాదుల సంచారంపై సమాచారం అందింది. అది తెలుసుకున్న సైన్యం బుధవారం రాత్రి బెహిబాగ్ ప్రాంతంలోని కద్దర్ గ్రామాన్ని చుట్టుముట్టాయి. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని అధికారులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని, ఆ తర్వాత భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరపడంతో ఆపరేషన్ ఎన్ కౌంటర్ గా మారిందని వారు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
ఆర్మీ సోషల్ మీడియాలో సమాచారం
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో చినార్ కార్ప్స్ ఇలా రాశారు, “19 డిసెంబర్ 2024న, ఉగ్రవాదుల సమచారంపై నిర్దిష్ట నిఘా ఆధారంగా, భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. కుల్గామ్‌లోని కదర్‌లో తనిఖీలు చేశారు. ఈ సమయంలో సైనికులు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించారు. అప్పుడేే తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు.
భద్రతా ఏర్పాట్లపై సమావేశం
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జమ్మూకశ్మీర్‌లో భద్రతా ఏర్పాట్లపై హోం మంత్రి అమిత్ షా ఇవాళ (డిసెంబర్ 19) ఢిల్లీలో సమావేశం నిర్వహించనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ, పారామిలటరీ బలగాలు, జమ్మూ కాశ్మీర్ పరిపాలన, నిఘా సంస్థలు, హోం మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు హాజరవుతారు. అంతకుముందు జూన్ 16న ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
Also Read: పెళ్లయిన మహిళలు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసే విషయాలు ఇవే – ఈ సెర్చ్ ఫలితాలు ఊహించనివి !
మరిన్ని చూడండి