Mukesh Ambani Nita Ambani gift a villa to Anant Ambani-Radhika Merchant : కొత్త జంట ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడపడడానికి తల్లిదండ్రులు తగిన సౌకర్యాలు కల్పించాలని అనుకుంటూ ఉంటారు. ఎవరి రేంజ్ కు వారు ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. మరి అపర కుబేరులు.. ప్రపంచం మొత్తం తిరిగి చూసేలా పెళ్లి వేడుకల్ని నిర్వహించిన ముకేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు తమ ఇంటి కొత్త జంటకు అలాంటి ఏర్పాటు చేశారు. ఊహించనంత లగ్జరీ ఉండే అత్యంత సుందరమైన ఇంటిని బహుమకరించారు. అయితే అది మన దేశంలో కాదు…దుబాయ్‌లో.
దుబాయ్‌లో అత్యంత లగ్జరీ విల్లా గిఫ్ట్
దుబాయ్‌లో పామ్ జుమేరియా ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ నివాసాల సముదాయంగా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి చోట.. అంబానీల స్థాయిలో ఉండేలా అతి పెద్ద లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారు. అందులో ..ఇంటీరియర్స్ దగ్గర నుంచి ప్రతి సౌకర్యం ప్రపంచంలోని ది బెస్ట్ అనేలా తీర్చిద్దారు. ఈ విల్లా స్పెషాలిటీ.. ప్రైవేటు బీచ్ ఉండటం. దాదాపుగా మూడు వేల స్క్కేర్ ఫీట్ కొత్త ఇల్లు ఉంటుంది. అలాగే 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ కూడా ఉంటుంది. ఏ విధంగా చూసినా.. ఈ విల్లా డిజైన్.. సౌకర్యాలు అన్నీ కలిపి మాస్టర్ పీస్ అని చెప్పవచ్చని దుబాయ్ హౌసింగ్ నిపుణులు తేల్చారు.
తప్పు ఎవరిదైనా అమ్మాయిలనే నిందిస్తారు- కోల్‌కత్తా డాక్టర్ ఘటనపై నటి సెలీనా జైట్లీ ట్వీట్
విల్లా ఖరీదు రూ. 640 కోట్లు
మరి ఇంత లగ్జరీగా ఉండే ఈ ఇంటి ఖరీదు ఎంత ఉంటుందనుకుంటున్నారు. 640 కోట్ల రూపాయలు. దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన విల్లాల్లో ఇది ఒకటి. ఈ ఇంటిని అంబానీలు 2022లోనే కొనుగోలు చేశారు. ఇరప్పుడు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్‌లకు గిఫ్టుగా ఇచ్చేందుకు .. మరింత లగ్జరీయస్‌గా తయారు చేసి.. వారికి అప్పగించారు. అనంత్ – రాధిక తమ పెళ్లి షాపింగ్‌ను కూడా ఎక్కువగా దుబాయ్‌లోనే చేశారు. అక్కడ వారు ప్రత్యేక కాన్వాయ్‌తో పర్యటించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయలేదు, సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు
ముఖేష్ వ్యక్తిగత సంపద 9 లక్షల కోట్ల రూపాయల పైనే
రిలయన్స ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఉన్న ముఖేష్ అంబానీ వ్యక్తిగత ఆస్తుల విలువే 9 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. తమ చిన్న కుమారుడు అయిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహాన్ని.. దాదాపుగా ఏడాదిన్నర పాటు నిర్వహించిన వేడుకల నేపధ్యంలో ఘనంగా నిర్వహించారు. దాదాపుగా ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారని అంచనా. ప్రపంచ స్థాయిలో సెలబ్రిటీలు అంతా ఈ పెళ్లికి హాజరు అయ్యారు.
మరిన్ని చూడండి