Kuwait News: కువైట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఈ మృతుల్లో 5 గురు భారతీయులున్నారు. వీళ్లంతా కేరళకి చెందిన వాళ్లే. Kuwait News Agency (KUNA) ఈ విషయం వెల్లడించింది. ఓ బిల్డింగ్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం (జూన్ 12) బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు భవనం అంతా వ్యాపించాయి. లోపల చాలా మంది చిక్కుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయని స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదానికి కారణమేంటో అధికారులు విచారణ చేపడుతున్నారు. మంగఫ్ బ్లాక్‌లోని ఆరంతస్తుల బిల్డింగ్‌లో ఈ ప్రమాదం జరిగింది. కింది అంతస్తులోని కిచెన్‌లో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రమాదం జరగ్గా తరవాత కాసేపటికే అపార్ట్‌మెంట్‌లోని అన్ని ఫ్లోర్స్‌కీ వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమై కొందరు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే మంటల్లో చిక్కుకుని ఆహుతి అయ్యారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నారు. వీళ్లలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా తెలిపింది.
మరిన్ని చూడండి