Uttam Resigned MP Post: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ పర్యటన (Delhi Tour)లో ఉన్నారు. బుధవారం (డిసెంబర్ 13న) ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన… టెన్ జన్‌ఫథ్‌లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంట ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి(MLA Padmavathi) కూడా ఉన్నారు. సోనియా, రాహుల్ గాంధీతో కాసేపు సమావేశయ్యారు. ఫొటోలు కూడా దిగారు. ఆ ఫొటోలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సోనియా, రాహుల్ గాంధీని కలిసిన తర్వాత… పార్లమెంట్‌కు వెళ్లారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam kumar Reddy). తన ఎంపీ పదవి (MP Post)కి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. ఈ విషయాన్ని కూడా ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్ కాంగ్రెస్ తరపు నల్లగొండ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు తాగా… తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన భార్య పద్మావతి కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడటంతో.. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. డిసెంబర్ 7న సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఎల్బీ స్టేడియంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఆయనకు.. నీటి పారుదల శాఖ, ఎత్తిపోతల పథకాలు, ఆహారం, పౌరసరఫరాల శాఖలను కేటాయించారు సీఎం రేవంత్‌రెడ్డి.
తెలంగాణలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి… తన ఎంపీ పదవిని వదులుకోవాలి. దీంతో ఇవాళ ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ ఎంపీగా రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి… తన రాజీనామా లేఖను సమర్పించారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా భాత్యతలు చేపట్టాక… రోజూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు ఉత్తమ్‌కుమార్. నీటిపారుదల (Irrigation), పౌరసరఫాల శాఖల(Civil Supplies Department)పై వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి… ఆయా శాఖలు అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది కార్డుదారులు రేషన్ తీసుకోవడం లేదని పౌరసరఫరాల సంస్థ గుర్తించింది. వారి కార్డులో ఉంచాలో లేదా అన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయిస్తామన్నారు. ఇక… మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన అంశంపై కూడా విచారణ జరిపిస్తామన్నారు.
తెలంగాణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోనియా, రాహుల్ గాంధీని కలవడం కూడా ఇదే మొదటిసారి. తనకు మంత్రి పదవి ఇచ్చి.. ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసినందుకు సోనియా, రాహుల్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.