Homeఅంతర్జాతీయంఇతను 2050లో పుట్టాల్సిన వ్యక్తి - ఈవీ కార్‌తో పూరీలు చేసేస్తున్నాడు !

ఇతను 2050లో పుట్టాల్సిన వ్యక్తి – ఈవీ కార్‌తో పూరీలు చేసేస్తున్నాడు !


Rajasthan man fries Kachori using his EV: ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలం.  పెద్ద పెద్ద కార్లు, బస్సులు కూడా బ్యాటరీలతో వచ్చేస్తున్నాయి.  పెట్రోల్ ,డీజిల్ తో పని లేదు.  చార్జింగ్ పెట్టుకుంటే చాలు ఎక్కడికైనా పోయి రావొచ్చు. అంత వరకూ అందరూ ఆలోచిస్తారు. కానీ..ఎలక్ట్రిక్ కార్లతో అంతకు మించిన ఉపయోగాలు ఉన్నాయని ఓ వ్యక్తి నిరూపిస్తున్నారు.అవన్నీ జర్నీకి సంబంధించిన విషయాలు అయితే సరే.. అనుకోవచ్చు.కానీ అతను కారును ఉపయోగించి వంటలు చేసేస్తున్నాడు. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. 

రాజస్తాన్‌లోని ఓ వ్యక్తి టాటావారి ఎలక్ట్రిక్ కారు కొనుక్కున్నాడు. ఓ సారి లాంగ్ జర్నీకి వెళ్లాడేమోకానీ మధ్యలో ఆకలయింది. వెంటనే కారుని ఆపేసి.. తన కారులో ఉన్న ఇండక్షన్ స్టవ్  బయటకు తీశాడు. కారుకు చార్జింగ్ పెట్టే పాయింట్ దగ్గర… ఇండక్షన్ స్టవ్ ప్లగ్ పెట్టేసి వంట ప్రారంభించేశాడు.కాసేపటికి పూరీలు పొంగించుకున్నాడు. ఈ వీడియోను ఓ వ్యక్త్తి తీసిసో షల్ మీడియాలో పెట్టాడు. అంతే క్షణాల్లో వైరల్ అయిపోయిది.            

సాధారణంగా ఫ్రెండ్స్అంతా కలిసిస క్యాంప్‌కు వెళ్తే ఖచ్చితంగా చిన్న సిలిండరో ..గ్యాస్ తో నిండిన స్టవ్వు లేకపోతే. మరో వంట పరికరం తీసుకెళ్లాలి. ఇండక్షన్ స్టవ్ తీసుకెళ్తే కరెంట్ అందుబాటులో ఉండాలి లేకపోతే పనికి రాదు. పిక్నిక్‌కి నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్తారు కాబట్టి అక్కడ కరెంట్ ఉండదు. అలాంటి వారికి ఎలక్ట్రిక్ కార్లు బాగా ఉపయోగపడతాయి. ఈవీ కార్ బ్యాటరీని ఇండక్షన్ స్టవ్ కు లింక్ చేసేసుకుని వంటలు చేసేసుకోవచ్చు. 

అయితే ఇతని ఐడియాను అందరూ అభినందిస్తున్నారు కానీ.. ఇఇలా చేయడం సేఫా కాదా అన్నదానిపై మాత్రం ఎవరూ ఏమీ చెప్పడం లేదు. ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలతో గేమ్స్ ఆడ కూడదని నిపుణులు చెబుతున్నారు. ఈవీ కార్ బ్యాటరీ పూర్తిగా వాహనం నడపడం కోసం తయారు చేసిందని ఇలా వాడితే సమస్యలు వస్తాయని ఆటోమోబైల్ నిపుణులు చెబుతున్నారు. 

భారత్‌లోఇటీవలి కాలంలో ఈవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దానికి తగ్గట్లుగానే ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్(Electric vehicles) తయారీపై ఎక్కువ పెట్టటుుబడులు పెడుతున్నాయిి.. ప్రముఖ కంపెనీలు ఈవీ రోడ్‌మ్యాప్‌తో భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాయి. రానున్న రోజుల్లో ఆటోమొబైల్ కంపెనీల పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ కార్ల(Electric cars) వాటా మెజార్టీగా మారనుంది సేల్స్ పెంచేందుకు కంపెనీలు బడ్జెట్ ధరలోనే బెస్ట్ ఈవీలను అందిస్తున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో.. అత్యధిక బ్యాటరీ బ్యాకప్‌తతోో వస్తున్న ఈవీ కార్లకు ఆదరణ లభిస్తోంది.                                  

Also Read: Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు – అద్భుతమైన వీడియో చూశారా?

 

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments