Narayan Singh Kushwah: మద్యానికి బానిసైన భర్తలను ఎలా దారికి తీసుకొచ్చుకోవాలో మహిళలకు సలహాలిచ్చారు మధ్యప్రదేశ్‌ మంత్రి నారాయణ్ సింగ్ కుశ్వాష్‌. ఎక్కడికో వెళ్లే బదులు ఇంట్లోనే మందు తాగమని బతిమాలాలని సూచించారు. అలా ఇంట్లో ఆడవాళ్లు, పిల్లల ముందు మద్యం సేవించాలంటే చాలా చిన్నతనంగా ఫీల్ అవుతారని, క్రమంగా వాళ్లే ఆ అలవాటు మానేస్తారని వివరించారు నారాయణ్ సింగ్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా మద్యానికి బానిసైతే రేపు పిల్లలూ అదే నేర్చుకుంటారని, ఈ విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరముందని అన్నారు.

అంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా లిక్కర్ షాప్‌లకు దగ్గర్లోని స్టాల్స్‌ని మూసివేయించారు. అక్కడే గంటల తరబడి కూర్చుని మందు తాగడాన్ని నిషేధించారు. 50% కన్నా ఎక్కువ మంది మహిళలు రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రాంతంలో లిక్కర్ స్టోర్‌నీ మూసేయాలని అప్పట్లో ఆయన ఆదేశించారు. ఇప్పుడు నారాయణ్ సింగ్ కూడా ఇదే సమస్యను ప్రస్తావించారు. బయట గంటల కొద్ది తాగుతూ కూర్చోవడం కంటే ఇంట్లోనే ఉంటే ఎప్పుడో అప్పుడు తప్పు తెలుసుకుంటారని చెప్పారు.

"మగవాళ్లు తాగుడు మానేయాలంటే ఒకటే చెప్పండి. బయటకు వెళ్లి తాగకుండా ఇంట్లోనే మద్యం సేవించాలని చెప్పండి. ఇంటికే మందు తెచ్చుకుని తాగమని సలహా ఇవ్వండి. అలా మీ ముందు తాగుతుంటే వాళ్లే ఎప్పుడో అప్పుడు చిన్నతనంగా ఫీల్ అవుతారు. క్రమంగా ఆ అలవాటుకి దూరమవుతారు. పిల్లలు, భార్య, తల్లి ముందు మందు తాగడాన్ని నామోషీగా అనుకుంటారు. అందుకే ఆ వ్యసనం నుంచి బయటపడతారు. వాళ్లు మందు మానేయడంలో ఈ సలహా కచ్చితంగా పనికొస్తుంది. చాలా మంది ఇంటిని గుడిగా భావిస్తారు. గుళ్లో కూర్చుని ఎవరైనా మందు తాగుతారా..?"

- నారాణయ్ సింగ్, మధ్యప్రదేశ్ మంత్రి

Also Read: Rajkot Airport: రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో కుప్ప కూలిన టర్మినల్ రూఫ్‌, ఢిల్లీ తరహా ఘటనతో ఉలికిపాటు

Source link
అలా చేస్తే మగవాళ్లు ఇట్టే మందు మానేస్తారు, మహిళలకు మధ్యప్రదేశ్ మంత్రి సలహా
RELATED ARTICLES