Homeఅంతర్జాతీయంఅమెరికా మహిళను అడవిలో కట్టేసిన ఘటనలో కొత్త ట్విస్ట్, ఏమైందంటే!

అమెరికా మహిళను అడవిలో కట్టేసిన ఘటనలో కొత్త ట్విస్ట్, ఏమైందంటే!


Maharashtra: ఇటీవల మహారాష్ట్ర లోని సింధుదుర్గ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుసుకుంది. అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళ(50) ను ఆమె భర్త అటవీ ప్రాంతంలో చెట్టుకు కట్టేసి వెళ్లారని ప్రచారం జరిగింది. ఆమె వానలో తడుస్తూ ఆకలితో అలమటిస్తూ నీరసించిపోయింది. కాపాడండి అంటూ అరుస్తుండడంతో బాధితురాలి ఏడుపులు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే బాధితురాలిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఆమె వద్ద అమెరికా పాస్ పోర్టు, తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డు, మరికొన్ని డాక్యుమెంట్స్ దొరికాయి.
 
నన్ను ఎవరూ బంధించలేదు
కానీ ఈ కేసులో ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది. చెట్టుకు సంకెళ్లతో బంధించడంలో మరో వ్యక్తి ప్రమేయం లేదని ఆ మహిళ వెల్లడించింది. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, తనకు భర్త కూడా లేడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రత్నగిరిలోని ఓ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో  ఆమె.. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలను చెప్పుకొచ్చింది.  

భర్తే కట్టేశాడని ఆరోపణ
ఆ మహిళను ఆమె భర్తే అటవీ ప్రాంతంలో కట్టేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఆమె భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి పరిస్థితిని చూసిన పోలీసులు ఆమె రెండ్రోజులుగా ఆహారం తీసుకోలేదని, వాంగూల్మం ఇచ్చే పరిస్థితిలో కూడా లేదన్నారు. అయితే 40 రోజులుగా తాను ఆహారం తీసుకోలేదని కాగితంపై బాధితురాలు రాసి చూపించిందని పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. లేవలేని స్థితిలో ఉన్న బాధితురాలిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. 

పోలీసులు ఏమన్నారంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనుర్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం ఓ గొర్రెల కాపరికి మహిళ అరుపులు వినిపించాయి. దాంతో అతను చుట్టుపక్కల వెతికాడు. కానీ ఆమె ఎక్కడ ఉందో కనుక్కోలేకపోయాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అడవిలో వెతకగా..ఓ చెట్టుకు ఇనుప గొలుసుతో కాలును చెట్టుకు కట్టేసి ఉన్న మహిళను గుర్తించారు. ఆమె వద్ద అమెరికా పాస్‌పోర్టు, తమిళనాడు ఆధార్‌ కార్డు, మరికొన్ని కాగితాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని, మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.  

Also Read: Bangladesh Protests: ఆ ఫ్యామిలీకి ఆగస్టు శాపం – 50 ఏళ్ల కిందట తండ్రి హత్య, ఇప్పుడు పారిపోయిన షేక్ హసీనా

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments