What Is Current Cyclone Name: మిగ్‌జాం తుపాను ఇప్పుదు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. సముద్రంలో ఏర్పడిన సైక్లోలకు పేర్లు ఎందుకు పెట్టాలి. తుపాను అంటే సరిపోతుంది కదా. అంటే తుపానులు అంటేనే చాలా నష్టాన్ని కలిగిస్తాయి. కొన్ని తుపానులు మాత్రం ఊహించని విధంగా భయభ్రాంతులు సృష్టిస్తాయి. అలాంటి తుపానులపై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్‌లో వాటి ప్రస్తావన వచ్చినప్పుడు అర్థమయ్యేందుకు ఈ పేర్లు పెడతారు.
తుపాలకు పేర్లు పెట్టేందుకు ప్రత్యేక థీయరీ అనుసరిస్తారు. ఏ సముద్రంలో తుపానులు సంభవిస్తాయో ఆ సముద్రానికి ఆనుకొని ఉన్న దేశాలు పేర్లు పొట్టొచ్చు. ఒక్కో తుపాను వచ్చిన ఒక్కో దేశానికి నామకరణం చేసే ఛాన్స్ వస్తుంది. ఈ పేర్లు పెట్టే కల్చర్‌ను 2004 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. ప్రపంచ వాతావరణ సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్స్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ కలిసి ఈ సంప్రదాయనికి తెరలేపారు. అప్పటి నుంచి తుపానులకు పేర్లు పెడుతున్నారు.
61 కిలోమీటర్లకు వేగంతో వచ్చే తుపానులకు మాత్రమే ఈ పేర్లు పెడతారు. సముద్రాల్లో వచ్చిన అన్నింటికీ ఈ పేర్లు పెట్టబోరు. ఆసియాలో ఏర్పడే తుపానులకు 13 దేశాలు నామకరణం చేస్తాయి. అక్షర క్రమంలో మొదట బంగ్లాదేశ్ పేరు ఉంటుంది. తర్వాత ఇండియా పేరు ఉంది. ఉత్తర హిందూ మహాసముద్రం, అరేబియాలో ఏర్పడే తుపానులకు భారత వాతావరణ శాఖ పేర్లు పెడుతుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడును అతలాకుతలం చేస్తున్న మిగ్‌జాం తుపానుకు మయన్మార్ పేరు పెట్టింది. మిగ్‌జాం అంటే బలం అని అర్థం వస్తుంది. మిగ్‌జాం ఈ ఏడాది హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఆరో తుపాను కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుల్లో నాలుగోది. డిసెంబర్ 3న నైరుతి బంగాళాఖాతంలో మిగ్‌జాం తుపాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ సముద్ర పరీవాహక ప్రాంతాలలో వచ్చే తుపాల పేర్లను RSMC, TCWC పెడతాయి. ఈ ప్రక్రియను పరిశీలించేందుకు ఆరు RSMCలు పని చేస్తుంటాయి.
2023 వచ్చిన తీవ్ర తుపానులు ఇవే
మే 9-15 మధ్య వచ్చిన మోచా తుపాను చైనా, బంగ్లాదేశ్, భారత్, శ్రీలంకను వణికించేసింది. 1.5 బిలియన్ల ఆస్తి నష్టం సంభవించగా 463 మంది మృత్యువాత పడ్డారు.
జూన్ 6-19 మధ్య వచ్చిన బిపర్‌జాయ్ తుపాను కూడా అదే స్థాయి నష్టాన్ని మిగిల్చింది. ఇది ఇండియా పాకిస్థాన్‌పై ఎక్కువ ప్రభావం చూపించింది. 124 మిలియన్ల రూపాయల ఆస్తినష్టం సంభంవించగా 17 మంది చనిపోయారు.
తేజ్ పేరుతో అక్టోబర్‌లో 20-24 మధ్య వచ్చిన తుపాను ఒమన్, యెమెన్ దేశాల్లో చాలా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
అదే అక్టోబర్ 21-25 మధ్య బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్, మిజోరాంలో భయంకరమైన తుపాను వచ్చింది. దీని కారణంగా 567 మిలియన్ల రూపాయల నష్టం వాటిల్లింది. 17 మంది మృత్యువాత పడ్డారు.
అదే ప్రాంతాన్ని కవర్ చేస్తూ నవంబర్ 14-18 మధ్య మిథిలి అనే పేరుతో తుపాను బీభత్సం సృష్టించింది. 276 మిలియన్ల ఆస్తి నష్టం జరగ్గా ఏడుగురు చనిపోయారు.
ప్రస్తుతం మిగ్‌జాం పేరుతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకొని తుపాను కొనసాగుతోంది. ఇది ఎంత నష్టాన్ని మిగులుస్తుందో అధికారులు అంచనా వేయలేకపోతున్నారు.
ఇప్పటి వరకు ఎక్కువ విధ్వంసం సృష్టించిన తుపానులు
1. బైపార్జోయ్
అత్యంత తీవ్రమైన తుపాను, బైపార్జోయ్ తుపాను జూన్ 6న తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడింది. ఇది గరిష్ట వేగం గంటకు 195 కిలోమీటర్లు. జూన్ 15, 2023న గుజరాత్‌లో తీరం దాటింది.
2. మాండౌస్
తుపాను మాండౌస్ డిసెంబర్ 14, 2022న అండమాన్ నికోబార్ దీవులు, చెన్నై తీరాన్ని తాకింది. మాండౌస్ తీవ్రమైన తుపాను, ఇది 2022 మూడవ తుపాను.
3. సిత్రంగ్
సిత్రంగ్ తుపాను అసోం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అండమాన్- నికోబార్ దీవులను 2022 అక్టోబర్ 22-25న ప్రభావితం చేసింది.
4. అసని
2022లో వచ్చిన మొదటి తుపాను. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాలను తాకింది. దీని వలన 2022 మే 7-12 మధ్య ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో తీవ్ర వర్షం కురిసింది.
5. జావద్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ను తాకింది.
6. గులాబ్
యాస్ తుపాను ఏర్పడిన నెలరోజుల తర్వాత గులాబ్ తుపాను సెప్టెంబర్ 25న ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలను తాకింది.
7. టౌక్టే
అరేబియా సముద్రంలో ఏర్పడింది టౌక్టే తుపాను. 2021 మే 17న దక్షిణ గుజరాత్‌ను తాకింది. ఇది చాలా తీవ్రమైన తుపానుగా చెప్పారు. దీని వల్ల మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లో భారీ నష్టం వాటిల్లింది.
8. యాస్
బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను మే 2021లో పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాన్ని తాకింది, దీనికి ఒమన్ పేరు పెట్టింది.
9. నిసర్గ
2021లో అరేబియా సముద్రం నుంచి వచ్చిన రెండో తుపాను. నిసర్గా తుపాను ముంబైలోని అలీబాగ్‌లో తీరాం తాకింది. 6 గంటల్లో బలహీనపడింది.
10. అంఫాన్
శక్తివంతమైన ఉష్ణమండల తుపాను అంఫాన్. ఒడిశా. పశ్చిమ బెంగాల్‌లో విధ్వంసం సృష్టించింది. ఇది బంగాళాఖాతంలో ఏర్పడిన శతాబ్దపు తొలి సూపర్ సైక్లోన్
11. కైర్
2007లో అరేబియా సముద్రంలో వచ్చిన రెండో బలమైన ఉష్ణమండల తుపానుగా చెబుతారు. పశ్చిమ భారతదేశం, ఒమన్, UAE, సోకోత్రా, సోమాలియాను ప్రభావితం చేసింది.
12. మహా
అత్యంత తీవ్రమైన తుపాను. అయితే సముద్రంలోనే బలహీన పడి అల్పపీడనంగా గుజరాత్ సమీపంలో తీరం దాటింది.
13. వాయు
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపాను గుజరాత్‌లో ఓ మోస్తరు నష్టం కలిగించింది. మాల్దీవులు, పాకిస్తాన్ ఒమన్‌ను ప్రభావితం చేసింది.
14. హిక్కా
అరేబియా సముద్రంలో తీవ్రరూపం దాల్చిన హిక్కా తుపాను ఒమన్‌ను తాకింది. 2019లో అరేబియా సముద్రం నుంచి క్యార్, మహా, వాయు, హిక్కా అనే నాలుగు తుపానులు ఏర్పడ్డాయి.
15. ఫని
1998లో వచ్చిన అత్యంత బలమైన తుపాను. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, బంగ్లాదేశ్, భూటాన్ శ్రీలంకను తాకింది.
16. బుల్బుల్
చాలా తీవ్రమైన తుపాను. పశ్చిమ బెంగాల్‌ను తాకింది. దీని వలన భారీ వర్షాలు పడ్డాయి. వరదల కారణంగా విధ్వంసం జరిగింది. బంగ్లాదేశ్‌పై కూడా ప్రభావం చూపింది.