Homeఅంతర్జాతీయంఅద్వానీకి భారతరత్న అవార్డు ప్రదానం, ఇంటికి వెళ్లీ మరీ అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అద్వానీకి భారతరత్న అవార్డు ప్రదానం, ఇంటికి వెళ్లీ మరీ అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


LK Advani Bharat Ratna Award: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రత్న అవార్డు ప్రదానం చేశారు. ఆయన ఇంటికి వెళ్లి మరీ ఈ అవార్డుని అందించారు. వయసు రీత్యా ఆయన బయటకు వచ్చే పరిస్థితులు లేకపోవడం వల్ల ఇలా ఆయన ఇంట్లోనే అవార్డు ప్రదానం చేయాల్సి వచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. అద్వానీ పక్కనే కూర్చుని ఆత్మీయంగా పలకరించారు. ఎల్‌కే అద్వానీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకి భారత రత్న అవార్డు ప్రదానం చేయనున్నట్టు ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు అధికారికంగా ఆయనకు ఆ అవార్డుని బహుకరించారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు. 

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments