Homeఅంతర్జాతీయంఅంబానీలూ జీతాలు తీసుకుంటారు - వాళ్ల కమిట్‌మెంట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు !

అంబానీలూ జీతాలు తీసుకుంటారు – వాళ్ల కమిట్‌మెంట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు !


Mukesh Ambani :  రిలయన్స్ గ్రూపు అంటే అంబానీలది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ అసలైన నిజం ఏమిటంటే అందులో చాలా మంది వాటాదారులు ఉంటారు. ఆ వాటాదారుల్లో మేజర్ వాటాదారులు అంబానీ కుటుంబసభ్యులు. అందుకే వారికి కంపెనీపై ఆధిపత్యం ఉంటుంది.కంపెనీల్లో వచ్చే లాభాలను… అందరి వాటాదారులతో పాటు అంబానీలూ పంచుకుంటారు. అలాగే వారు కంపెనీని నడిపిస్తున్నందున ఆయా స్థానాల్లో పని చేసినందుకు జీతాలూ తీసుకుంటారు. 

కరోనా  సమయం నుంచి జీతం తీసుకోని ముఖేష్ అంబానీ

ముకేష్ అంబానీ గతంలో ఘనంగానే జీతం తీసుకునేవారు. రియలన్స్ గ్రూపు వ్యవహారాలను ఆయన ఒంటి చేత్తో చక్కబెడతారు. ఆయనకు అందరి కంటే ఎక్కువ జీతం అందాలి. కానీ తన జీతాన్ని ఆయన పూర్తి స్థాయిలో త్యాగం చేశారు. గత నాలుగేళ్లుగా ఒక్క రూపాయి తీసుకోవడం లేదు. నిజానికి కంపెనీ నిబంధనల ప్రకారం ఆయనకు జీతంతో పాటు భత్యాలు, స్టాక్ ఆప్షన్స్‌తో పాటు పలు రకాల ప్రయోజనాలు పొందగలరు. అవన్నీ కలిపితే వందల కోట్లలోనే ఉంటాయి. కానీ ముకేష్ అంబానీ ఫ్రీ సర్వీస్ చేయడానికే నిర్ణయించకున్నారు. కరోనా ప్రభావం ముగిసింది కాబట్టి.. తన జీతం కోసం ఆయన మళ్లీ రెడీ అవుతారో లేదో చూడాల్సి ఉంది. 

ఎంపాక్స్ మరో కరోనా కానే కాదు – వ్యాక్సిన్ కూడా రెడీ – WHO హెల్త్ ఎమర్జెన్సీ ఎందుకంటే ?

నీతా అంబానీ ఎంత తీసుకుంటారంటే ?

నితా అంబానీ గతంలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా ఉండేవారు. 2023 వరకూ ఒక్క సిట్టింగ్‌కు రెండు లక్షల రూపాయలు, అలాగే కమిషన్‌గా 97 లక్షలను అందుకునేవారు. ఆ తర్వాత తన సేవలను నీతా అంబానీ విస్తరించారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఈ కారణంగా ఆమెకు పారితోషికం పై స్పష్టత లేదు. అయితే ముఖేష్ అంబానీలాగే నీతా అంబానీకి కూడా ఇక నుంచి ఎలాంటి పారితోషికం ఉండకపోవచ్చని అంచనా. 

అంబానీ వారసులకూ జీతాలు

అంబానీ వారసులు కంపెనీలోకి అడుగు పెట్టారు. కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆకాష్ అంబానీ  జియో ఇన్ఫో కామ్ లిమిటెడ్ కు చైర్మన్ గా ఉన్నారు. ఈషా అంబానీ  జియో ఇన్ఫోకామ్, రిటైల్ కంపెనీల బోర్డుల్లో ఉన్నారు. అనంత్ అంబానీ జియో ఫ్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్ తో పాటు పలు కంపెనీల్లో డైరక్టర్ గా సేవలు అందిస్తున్నారు. వీరందరికీ కంపెనీల నిబంధనల ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు. 

వామ్మో! బెడ్‌రూమ్‌లో 9 అడుగుల కోబ్రా, చూస్తేనే జడుసుకుని పోతామేమో – వీడియో

అయితే అంబానీ కుటుంబం రిలయన్స్ కోసం పడే కష్టంతో పోలిస్తే వారికి లభించే జీతం, ఇతర భత్యాలు చాలా తక్కువ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీరు ఎంత ఎక్కువగా పని చేస్తే..  వారికి అంత లాభం. ఎందుకంటే..  రిలయన్స్ సాధించే లాభాల్లో అత్యధిక వాటా.. ముఖేష్ అంబానీై కుటుంబానికే చెందుతుంది.  వీరి షేర్లు ఎక్కువ కాబట్టి.. వీరికి ఆ లాభం దక్కుతుంది.          

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments